ముస్లిం అని సరుకులు తీసుకోను అన్నాడు…!

-

కరోనా వైరస్ మన దేశంలో వ్యాప్తి చెందడానికి ఒక మత౦ కారణమని కొందరు సోషల్ మీడియాలో ఎక్కువగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా సోకింది అనే భయంతో చాలా మంది ముస్లిం లతో మాట్లాడటానికి భయపడుతున్నారు. కరోనకు మతం లేదని తెలిసినా సరే… కొంత మంది మాత్రం సోషల్ మీడియాలో ఏదోక ప్రచారం చేస్తూనే ఉన్నారు.

ముంబైలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీనితో ప్రజలు బయటకు రాకుండా వస్తువులను డోర్ డెలివరి చెయ్యాలని భావించి నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్ సంస్థలు హోం డెలివరీ సేవలు అందించడంతో కాస్త సరుకుల ఇబ్బందులు అనేవి తీరాయి. ఈ తరుణంలో ఓ కస్టమర్ ఇంటికి డెలివరీ బాయ్ నిత్యావసరాలను తీసుకుని రాగా… డెలివరీ బాయ్ ముస్లిం కావడంతో కస్టమర్ సరుకులు తీసుకొను అని చెప్పాడు.

మీ మతస్తుల నుంచి సరుకులు తీసుకునే ప్రసక్తి లేదని తిరస్కరించడం తో మనస్తాపానికి గురైన డెలివరి బాయ్ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. తాను రక్షణ చర్యలన్నీ తీసుకున్నా అని… చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించినా కూడా ముస్లింల దగ్గర నుంచి తాము సరుకులు తీసుకోమంటూ గొడవ చేశారని ఆవేదన వ్యక్తం చేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version