కృష్ణా నది నీళ్ల గొడవ మళ్లీ తెరపైకి వచ్చిది. మొన్నటి వరక కాస్త సైలెంట్‌గా ఉన్న తెలంగాణ ప్రభుతవం మొన్నటి కేబినెట్ మీటింగులో కేసీఆర్ జగన్‌తో జల జగడానికి సై అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులకు పర్మిషన్ లేదని దీనిపై కోర్టులో కొట్లాడాలని డిసైడ్ అయింది. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంపై డైరెక్టుగా విమర్శలు చేయని కేసీఆర్ ప్రభుత్వం అనూహ్యంగా ఏపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది.
దీంతో కృష్ణా నదిపై రెండు కొత్త ప్రాజెక్టులకు కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే క్రమంలో ఈరోజు మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మంత్రి ప్రశాంత్‌రెడ్డిలు జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైయస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు అన్యాయం చేసి నీటిని తరలించుకుపోయారని ఆయన పెద్ద దొంగ అని చెప్పారు. అలాగే ఆయనకు కొడుకు జగన్ ఇప్పుడు గజదొంగలా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి మాటల వెనక కేసీఆర్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ పర్మిషన్ లేనిదే జగన్‌ను వారు అనలేరు. ఇప్పటి వరకు జగన్‌తో కేసీఆర్‌కు మంచి సన్నిహిత్యమే ఉంది. మరి వీరి మాటలతో కేసీఆర్ మరో వివాదానికి తెర తీస్తున్నారో లేదో చూడాలి.