ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రానున్న రోజుల్లో ఒంటరి కానుందా అంటే విశ్లేషకులు మాత్రం అవుననే అంటున్నారు. కరోనా విషయంలో తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమెరికా వలసలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. అమెరికా ఒక లిబరల్ దేశం. ఎక్కడి నుండి వచ్చిన వారినైనా ప్రతిభ ఉంటే అక్కున చేర్చుకుంటుంది. అక్కడ వారిలో చాలా గ్రీన్ కార్డ్ శాశ్వత సభ్యత్వం పొందిన వారే ఎక్కువ ఉంటారు, వీళ్ళే అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంలో కూడా తోడ్పడుతుంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ అమెరికా ప్రజల యొక్క జాతీయతను రెచ్చగొట్టే నిర్ణయాలను తీసుకుంటూ నవంబర్ లో రానున్న ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ట్రంప్ తీసుకున్న వలసల రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని, ప్రతిభ ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్తారని, తన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో అమెరికాను ప్రమాదంలోకి నెట్టుతున్నారని పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.