కరోనా వైరస్ నేపధ్యంలో బ్యాంకింగ్ సేవలకు కూడా ఇబ్బందులు ఎదురు అవుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులను బ్యాంకు లకు రావొద్దని తక్కువ మంది హాజరు కావాలని చెప్తున్నారు. దీని వలన స్టేట్ బ్యాంకు కూడా ఇబ్బంది పడుతుంది. తాజాగా స్టేట్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. పాత మీ పాత ఏటీఎం కార్డు బదులు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసిన వాళ్ళ కోసం ఈ ప్రకటన చేసింది.
డెబిట్ కార్డుల డెలివరీ ఆలస్యం అవుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా వైరస్ లాక్‌డౌన్, ఆంక్షల కారణంగా డెబిట్ కార్డుల డెలివరీలో జాప్యం ఉంటుందని వివరించింది. కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించుకోవాలని, బ్యాంకు బ్రాంచ్‌లకు రావొద్దని బ్యాంకు స్పష్టం చేసింది. ఇక కరోనా కారణంగా బ్యాంకు సమయాలను కూడా మార్చిన సంగతి తెలిసిందే.
ఒకవేళ మీరు ఇప్పుడు కొత్త డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే ఈ పద్దతిని ఫాలో అవ్వండి. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి… e-Services ట్యాబ్ పైన క్లిక్ చేయగానే ATM card services ఓపెన్ చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత Request ATM/debit card ట్యాబ్ పైన క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కొత్త ఏటీఎం కార్డుకు అప్లై చేయాలి. ఏటీఎం కార్డు ఎలాంటిది కావాలో కూడా అక్కడ చూపిస్తుంది.