తెలంగాణలో తొలి కుంభకోణానికి మూడేళ్లు

-

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద కుంభకోణంకు మూడేళ్ళు నిండాయి. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి కుంభకోణం వెలుగు చూసింది. యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఆ కుంభకోణానికి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయం వేదికైంది.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చలాన్ రూపంలో చెల్లించేందుకు ఇన్ వాయిస్ లను నకిలీలుగా తయారు చేసి రాష్ట్ర ఖజనాకు గండికొట్టారు వ్యాపారులు, రైస్ మిల్లర్ లు. వారికి బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పాటు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారుల వరకు ఇందులో ఉండడంతో రాష్ట్ర ఖజానాకు రూ.260 కోట్ల వరకు చిల్లుపడింది. స్థానికంగా నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులు, కార్ల షోరూంల అధినేతలు ఉండడం కోట్లలో జరిగిన కుంభకోణం అప్పట్లో సర్వత్ర చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆకాశరామన్న ఉత్తరంను వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ కు పంపడం ద్వారా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర సిఐడి, విజిలెన్స్ అధికారులు విచారణ చేసి ఒక సిఐతో పాటు పలువురు అధికారులను అరెస్టు చేసినా సొమ్ము మాత్రం పూర్తిగా ఇప్పటికి రికవరీ కాలేదు.వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన నకిలీ ఈ చలాన్ ల కుంభకోణంలో ప్రభుత్వానికి రూ.260 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేసింది ప్రభుత్వం. దశాబ్ధ కాలంలో నకిలీ ఈ చలాన్ లతో ఇన్ వాయిస్ లను రూపొందించి ఖజానాకు గండి కొట్టిన వ్యవహరంలో ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా విచారణ చేసి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు, పలు షోరూంల అధినేత లు కుంభకోణంలో ఉన్నారని వారి నుంచి సొమ్మును రాబట్టాలని నిర్ణయించారు. కుంభకోణంలొ రికవరీ రూ.62 కోట్లే అయింది

తెలంగాణ ఎర్పడిన తరువాత జరిగిన అతిపెద్ధ కుంభకోణం లో భాధ్యులపై చర్యలు తీసుకోవాడానికి ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఎందుకంటే వ్యాపారులు, రైస్ మిల్లుల యజమానులకు సంఘంలో పలుకుబడి, ధనవంతులు కావడమే. కుంభకోణం జరిగే వరకు వ్యాపారులు, రైస్ మిల్లర్లు కాంగ్రెస్ పార్టికి సానుభూతిపరులుగా ఉన్నారు. కోందరు రాష్ర్టస్థాయి పధవుల్లో ఉన్నారు. కాని కుంభకోణం జరుగడంతో వారు అరెస్టులు, రీకవరిల నుంచి తప్పించుకునేందుకు ఎకంగా అధికార పార్టీలోకి మారిపోయారు. దానితో ఈ కుంభకొణంలో రాష్ర్టస్థాయి నేతలుగా, వ్యాపారుల పైన అధికార పార్టీ నేతలే ఈగ వాలనీవ్వలేదు. వారినుంచి రికవరీ చేయ్యనివ్వలేదు. దానితో అప్పటి వరకు ప్రభుత్వం చేసిన విచారణలు అటకెక్కాయి.

ఇందులో ట్విస్టు ఏంటంటే అధికారులు సైతం ప్రభుత్వ ఉదాసినతను సోమ్ముచేసుకుంటు వారు తప్పించుకోగా , మరికోందరు రాజకీయాల్లోకి వేళ్లి సేఫ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version