వైసీపీ ఎంపీకి ఝ‌ల‌క్‌.. అలా అన‌డంతో!

-

వైసీపీ ఎంపీకి షాక్ త‌గిలింది. ఏదో చెప్ప‌బోయి మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయ‌నెవ‌రో కాదురాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ కుమార్‌. సోష‌ల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ ఎంపీ భ‌ర‌త్ అనే నేను, రాజ‌న్న ర‌చ్చ‌బండ లాంటి కార్య‌క్ర‌మాల‌తో వీడియోలు పోస్టు చేస్తుంటారు. ఇక లేటెస్టుగా ఓ వీడియోలో ఈయ‌న మాట్లాడిన మాట‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఈ వీడియోను టీడీపీ త‌మ్ముళ్లు తెగ వాడేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ వీడియోలో ఆయ‌న ప‌క్క‌నున్న వ్య‌క్తి క‌రోనా నుంచి కోలుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇదే టైమ్ లో ఎంపీ స్పందిస్తూ.. రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజల్ని బూస్ట్ చేయడానికి ఏవో లెక్క‌లు చెబుతాం. అవ‌న్నీ నిజ‌మ‌ని కాదు అని కామెంట్ చేశారు.

అంతే ఇక టీడీపీ వాళ్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ఏపీలో కోలుకున్న వారి సంఖ్య అంతా బోగ‌స్ అని వైసీపీ ఎంపీనే కుండ‌బ‌ద్ద‌ల కొట్టార‌ని ఆరోపిస్తున్నారు. జ‌గ‌న్ చెప్పిన లెక్క‌ల‌న్నీ బోగ‌స్ అని మార్గాని భ‌ర‌త్ స్ప‌ష్టం చేస్తున్నార‌ని పోస్టు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version