ఉత్తరాంధ్రలో హోరాహోరీ..వైసీపీ ఆధిక్యం ఆపగలరా?

-

మొన్నటివరకు గోదావరి జిల్లాల్లో, రాయలసీమలో రాజకీయం హోరాహోరీగా సాగితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో రాజకీయం వేడెక్కింది.  ఉత్తరాంధ్రని టార్గెట్ చేసుకుని ప్రతిపక్ష పార్టీలు ముందుకెళుతున్నాయి. అటు పవన్ వారాహి యాత్ర అక్కడే కొనసాగుతుంది. ఇటీవలే చంద్రబాబు ప్రాజెక్టులు పరిశీలించి..పలు సభలు నిర్వహించారు. ఇటు ఇప్పుడు విశాఖలో ఆగష్టు 15 వేడుకలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇలా బాబు-పవన్ ఉత్తరాంధ్ర టార్గెట్ గానే ముందుకెళుతున్నారు.

అయితే దసరా నాటికి విశాఖ పరిపాలన రాజధాని కానుంది. జగన్ అక్కడ నుంచే పాలన మొదలుపెట్టనున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎలాగో రాయలసీమలో వైసీపీదే ఆధిక్యం..ఇటు కోస్తా బెల్ట్ లో నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో వైసీపీకి పట్టు ఉంది. ఇక ఉత్తరాంధ్రలో ఆధిక్యం దక్కించుకుంటే ఇంకా అధికారం తమదే అని ధీమాలో వైసీపీ ఉంది. ఆ దిశగానే జగన్ ముందుకెళుతున్నారు. ఇక గుంటూరు-కృష్ణాలో టి‌డి‌పికి ప్లస్ ఉంది.

గోదావరి జిల్లాల్లో టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీని నిలువరించవచ్చు. ఇటు ఉత్తరాంధ్రలో కూడా ఆధిక్యం సాధించి..రాయలసీమ లో తక్కువ సీట్లు గెలుచుకున్న అధికారం దక్కించుకోవచ్చు అనేది చంద్రబాబు-పవన్ ప్లాన్. ఆ దిశగానే ఇద్దరు నేతలు పనిచేస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్ర టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 28 సీట్లు వచ్చాయి. టి‌డి‌పికి 6 సీట్లు వచ్చాయి. అయితే ఈ సారి టి‌డి‌పి-జనసేన పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ పొత్తు ప్రభావం విశాఖపై కాస్త ఉంటుంది. అక్కడ లీడ్ దక్కించుకోవచ్చు. విజయనగరం, శ్రీకాకుళంలో వైసీపీతో టి‌డి‌పి తలపడుతుంది. ఆ రెండు జిల్లాల్లో లీడ్ తెచ్చుకుంటే ఉత్తరాంధ్రలో టి‌డి‌పికి పట్టు చిక్కుతుంది. టి‌డి‌పికి చెక్ పెడితే వైసీపీ హవా ఉంటుంది. చూడాలి మరి ఈ సారి ఉత్తరాంధ్రలో ఆధిక్యం ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version