హుజురాబాద్‌ని లైట్ తీసుకున్న రేవంత్ రెడ్డి.. పోటీ చేసిన ఫలితం ఉండదా?

-

హుజరాబాద్ ఉప ఎన్నికల పోరుని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారా? అంటే అవుననే చెప్పొచ్చు. తాజాగా కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఏం చేయడం లేదని అన్నారు. హుజరాబాద్ లో పోటీ చేయించాలనే ఆసక్తి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.

తానొక్కడినే హుజరాబాద్ పోరులో పోరాడుతున్నా, సరే తనకు సపోర్టుగా నిలబడలేదని అన్నారు. డబ్బులు ఇచ్చి పిసిసి కొనుక్కున్న రేవంత్ రెడ్డి పార్టీని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తాను ఇంత కష్టపడుతున్న కూడా మద్దతుగా నిలబడలేదని అన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అయితే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో, హుజరాబాద్ పోరులో కాంగ్రెస్ తరపున నిలబడేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదివరకే రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే పొన్నం ప్రభాకర్ కి హుజురాబాద్ టిక్కెట్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అభ్యర్థి విషయంలో ఇంకా ఏ ఆలోచన చేయలేదని తెలుస్తుంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి హుజురాబాద్ పోరుని లైట్ తీసినట్లు కనిపిస్తుంది. కొత్తగా అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి హుజరాబాద్ ఒక పరీక్ష లాంటిదని విశ్లేషణలు వచ్చాయి. కానీ ఈ ఎన్నిక తన సామర్థ్యానికి పరీక్ష కాదని రేవంత్ కొట్టిపారేశారు. రేవంత్ ఇలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు. హుజరాబాద్ లో టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే వార్ జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ కనిపించడంలేదు.

ఓట్లు కూడా పెద్దగా పడేలా లేవు. ఎందుకంటే అక్కడి ప్రజలు ఈటలకు లేదా టిఆర్ఎస్ మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్‌కు ఇక్కడ ఓట్లు మంచిగా పడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఈటల వర్సెస్ టిఆర్ఎస్ గానే పోరు నడుస్తుంది కాబట్టి ఈ ఉప ఎన్నికని రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారు.  ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టినా కాంగ్రెస్‌కి ఏ మాత్రం ఓట్లు పడతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version