అమరావతి: వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం అమలుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, రెవిన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బొత్స, పెద్దిరెడ్డి, ధర్మాన కృష్ణ దాస్ లు సభ్యులుగా ఉందనున్నారు. సమగ్ర సర్వేను ఉద్దృతంగా చేయడంపై దృష్టి పెట్టనుంది ఈ కమిటీ. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం.. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలన్నీ ఈ ఏడాది పూర్తి కావాలని జగన్ ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలన్న సీఎం.. వైయస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలన్న సీఎం.. గ్రామాల్లో 14 వేల ట్రైసైకిళ్లు అర్బన్ ప్రాంతాల్లో 1034 ఆటోలు, మరికొన్ని వాహనాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.