లాజిక్ మిస్ అవుతున్న టీఆర్ఎస్..రేవంత్ రెడ్డి కే నష్టమా?

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి(revanth reddy) దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అదే స్థాయిలో టీఆర్ఎస్ నుంచి కూడా రేవంత్‌కు కౌంటర్లు పడుతున్నాయి. రేవంత్, చంద్రబాబు మనిషి అని విమర్శలు వస్తున్నాయి. టీపీసీసీ కాస్త టీటీడీపీగా మారిందని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ ముసుగులో తెలంగాణలోకి అడుగుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందుకే తన మనుషులను హస్తం పార్టీలోకి పంపి, పదవులు ఇప్పిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అంటున్నారు.

రేవంత్ రెడ్డి/revanth reddy

2018లోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని గెలవాలని చూసిన చంద్రబాబుని, ఆంధ్రాబాబు అని తెలంగాణ ప్రజలు వెళ్లగొట్టారన్నారని అంటున్నారు. అలాగే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని, ఇప్పుడు ఆయన పీసీసీ చీఫ్‌గా వచ్చారని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ విమర్శలకు రేవంత్ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాను చంద్రబాబు మనిషినైతే.. కేసీఆర్‌ ఆయనకు చెప్రాసీ అని అన్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ల బతుకు టీడీపీ అయితే.. హరీశ్‌రావు బతుకు కాంగ్రెస్‌ అని, హుజూరాబాద్‌ ఎన్నిక కోసం టీడీపీ నుంచి ఎల్‌.రమణను చేర్చుకుంటున్నారని రేవంత్ ఫైర్ అవుతున్నారు. అలాగే కేసీఆర్ కేబినెట్‌లో 75 శాతం మంత్రులు టీడీపీ నుంచి వచ్చినవారే అంటూ రేవంత్ లాజికల్‌గా మాట్లాడుతున్నారు.

ఇక ఇక్కడ టీఆర్ఎస్, రేవంత్ విషయంలో లాజిక్ మిస్ అవుతుందని, ఎందుకంటే టీఆర్ఎస్‌లో సగంపైనే నాయకులు టీడీపీ నుంచి వచ్చినవారే అని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పదే పదే చంద్రబాబు మనిషి అని విమర్శలు రావడం వల్ల రేవంత్‌కే నష్టమని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించడం లేదని, ఆ విషయాన్ని తెలుసుకుని రేవంత్, చంద్రబాబు ముద్రని తొలగించుకోవాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version