ఖైరతాబాద్‌లో ట్రైయాంగిల్ ఫైట్..దానం మళ్ళీ గట్టెక్కేనా?

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రైయాంగిల్ ఫైట్ జరగడం ఆనవాయితీగా మారిపోయింది. గత మూడు ఎన్నికల నుంచి అదే పరిస్తితి కనిపిస్తుంది. అలా త్రిముఖ పోరు జరిగే స్థానాల్లో ఖైరతాబాద్ కూడా ఒకటి. 2009 ఎన్నికల నుంచి ఇక్కడ త్రిముఖ పోరు నడుస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడిచింది. ఇక ప్రజారాజ్యం పార్టీ ఓట్లు చీల్చడంతో టి‌డి‌పి ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గెలిచారు.

ఇక 2014 ఎన్నికల్లో కూడా త్రిముఖ పోరు జరిగింది..కాంగ్రెస్, వైసీపీ, బి‌జే‌పిల మధ్య వార్ నడిచింది. అయితే టి‌డి‌పితో  బి‌జే‌పి పొత్తు ఉండటంతో..బి‌జే‌పి నుంచి చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. 2018 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ బి‌జే‌పి, కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ ల మధ్య పోరు నడవగా, ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీ తరుపున దానం నాగేందర్ పోటీ చేసి గెలిచారు. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. ఈ సారి కూడా బి‌జే‌పి-బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌కు పరిస్తితి మరీ అనుకూలంగా ఏమి లేదు..అదే సమయంలో బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీలు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. బి‌జే‌పిలో పలువురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు గాని..సీనియర్ నేత చింతలకే సీటు దక్కడం ఖాయమని చెప్పవచ్చు. అటు కాంగ్రెస్ సీటు దివంగత పి‌జే‌ఆర్ కుమార్తె విజయారెడ్డికి దక్కుతుందని తెలుస్తోంది.

ఈ ముగ్గురు నేతలు స్ట్రాంగ్ గానే ఉన్నారు..ముగ్గురికి నియోజకవర్గంపై పట్టు ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఏ పార్టీ గాలి ఉంటే..దాని బట్టి అభ్యర్ధులు గెలిచే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ సారి ఖైరతాబాద్ ఎవరి సొంతమవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version