బండ్ల గణేష్ కు ఎంత కష్టం వచ్చింది గురూ..!!

-

బండ్ల గణేష్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ లో పవన్ కల్యాణ్ కు భక్తుడిగా పేరు గాంచిన విషయం తెలిసిందే. అంతకు ముందు చిన్న వేషాలు వేస్తూ పెద్దగా పేరు లేని బండ్ల గణేష్ ఇక పవన్ కల్యాణ్ తో సినిమా గబ్బర్ సింగ్ తో ఎక్కడికో వెళ్ళి పోయాడు. దానితో వరసగా సినిమాలు నిర్మించడం చేస్తూ వచ్చాడు.

ఇక సినిమా ఈవెంట్స్ లో పవన్ కల్యాణ్ ను పొగిడే స్పీచ్ లు మరీ రాసుకొని వచ్చి మరీ హంగామా చేస్తూ ఉండేవారు. ఇది ఈవెంట్ కు వచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షించేది. కాక పోతే తన నోటి దూల వల్ల పవన్ ఆప్తుడు అయిన త్రివిక్రమ్ ను తిట్టి పవన్ కు దూరంగా ఉండి పోయాడు. ఇక పవన్ తో మరో సినిమా తీయాలనే ఆశ కూడా ఆవిరి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

దానితో ట్విట్టర్ లో రకరకాల పోస్టు లు పెడుతూ అభిమానుల్లో చర్చ జరిగేలా చేస్తూ ఉంటారు. ఈ రోజు ఈ రోజు పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా  డీవీవీ దానయ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ రోజు ట్విట్టర్ లో బండ్ల గణేష్ ‘మంచి వాడు ఎప్పుడూ మొండిగా నే ఉంటాడు ఎందుకంటే వాడికి నటించడం రాదు కాబట్టి విజయం అనేది ఆలస్యంగా లభించే ఓటమి.. ఓటమి కూడా ఆలస్యంగా లభించే విజయం ఓటమి ముగింపు కాదు.. విజయం శాశ్వతం కాదు. అంటూ,  ఉన్నది ఉంటుంది లేనిది ఎప్పుడూ ఉండదు దేనీని పట్టి ఉంచుకోవాలి దేనీని విడిచి పెట్టాలో తెలిసిన వాడే అసలైన మేధావి. అంటూ బండ్ల గణేష్ తన భాదను వెళ్లగక్కారు. దీనితో అన్న చేయాల్సిన సినిమా వేరే వారు చేస్తున్నారని విరక్తి కలిగి అలా పోస్టు పెడుతున్నట్లు ప్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version