పార్టీ నిర్మాణం పై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్..కారణం ఇదే

-

టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. జిల్లా అధ్యక్షులతో పాటు కమిటీల ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త నాయకత్వాన్ని తయారుచేయాలనే లక్ష్యంతో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడితో పాటు కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

 

పార్టీ నిర్మాణంపై అధికార టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గతంలో పార్టీకి జిల్లాల వారీగా అధ్యక్షులు ఉండేవారు. జిల్లా కమిటీలతో పాటు అనుబంధ కమిటీలు ఉండేవి. టీఆర్ఎస్ పార్టీ చివరిసారిగా 2015లో జిల్లా అధ్యక్షులను నియమించింది. అప్పడు జిల్లా కమిటీలను ప్రతిపాదించిన అధిష్టానం ఆమోద ముద్ర వేయలేదు. నియోజకవర్గలకు ఎమ్మెల్యేలే సుప్రీం అని కేసీఆర్ సమావేశాల్లో స్పష్టం చేశారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుల అవసరం ఉందా లేదా అన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతూ వస్తోంది.

కొత్త జిల్లాల వారీగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది. తాజాగా కొత్త జిల్లాల వారీగా అధ్యక్షుల నియామకం జరిపితే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. ఈ ప్రక్రియ చేపడితే జిల్లాలో కొత్తగా నాయకత్వం తయారు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల నియామకం, అనుబంధ కమిటీల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తారా లేక సమన్వయకర్తల పేరుతో బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version