మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది..మొదట టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటాపోటి వాతావరణం నడిచింది.. కానీ నిదానంగా టీఆర్ఎస్ పార్టీ లీడ్‌లోకి వస్తుంది..మొదట స్వల్ప మెజారిటీలతో బయటపడిన టీఆర్ఎస్..8, 9 రౌండ్లలో కాస్త లీడ్ పెంచుకుంది. 9వ రౌండ్లో టీఆర్ఎస్కు పోలైన ఓట్లు 7497, బీజేపీ 6665. 9వ రౌండ్లో టీఆర్ఎస్ లీడ్ 832.
9వ రౌండ్ ముగిసేసరికి..ఓవరాల్‌గా 3,923 ఓట్ల ఆధిక్యంలోకి టీఆర్ఎస్ వచ్చింది. ఇక బీజేపీ తమకు పట్టు ఉందనుకున్న చౌటుప్పల్, చండూరు మండలాల్లో కూడా టీఆర్ఎస్ లీడ్ సాధించింది.
అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ మంచి లీడ్ తెచ్చుకుంది..ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఈ ఆరు రౌండ్లలో టీఆర్ఎస్ లీడ్ పెరిగితే..ఇంకా గెలుపు ఖాయమే. అలా కాకుండా బీజేపీ గాని పుంజుకుంటే ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్త గారి గ్రామం పలివెలలో 400 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇదే గ్రామానికి ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.