మునుగోడు కౌంటింగ్: కోమటిరెడ్డిని ముంచనున్న కాంగ్రెస్..!

-

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ఆసక్తిగా సాగుతుంది..రౌండ్ రౌండ్‌కు పోరు ఉత్కంఠగా సాగుతుంది. ఎక్కువ రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో తెచ్చుకుంది..కానీ బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. 8 రౌండ్లలో ముగిసే సరికి…టీఆర్ఎస్ పార్టీ 3091 ఓట్ల లీడింగ్‌లోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి 52,347 ఓట్లు రాగా, బీజేపీకి 49,243 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 13,689 ఓట్లు వచ్చాయి.

అయితే ఇంకా ఏడు రౌండ్లు ఉన్నాయి..ఈ ఏడు రౌండ్లలో ఫలితం ఎలా వస్తుందో అర్ధం కాకుండా ఉంది. టి‌ఆర్‌ఎస్ పార్టీకి స్వల్ప లీడ్ మాత్రమే ఉండటంతో..బీజేపీకి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగిలిన రౌండ్లలో కూడా టి‌ఆర్‌ఎస్ పార్టీకి లీడ్ వస్తే..ఆ పార్టీ గెలుపు దాదాపు ఖాయమైనట్లే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓట్లు వస్తే..ఆటోమేటిక్ గా బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నష్టం చేకూరే ఛాన్స్ ఉంది.

ఎందుకంటే కోమటిరెడ్డి నుంచి కాంగ్రెస్ నుంచే వచ్చారు..ఆ పార్టీకి చెందిన ఓట్లని ఎక్కువ చీల్చుకుంటే కోమటిరెడ్డికి ప్లస్ అయ్యేది. కానీ ఎక్కువగా ఓట్లు చీలిక జరిగినట్లు లేదు. హుజూరాబాద్‌లో కేవలం 3 వేలు ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కానీ ఇక్కడ 8 రౌండ్లకు 13 వేలు వచ్చాయి. అన్నీ రౌండ్లు అయ్యే సరికి 20 వేల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అలా గాని జరిగితే కోమటిరెడ్డి వెనుకపాడిపోతారు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కేవలం 10 వేల ఓట్లు ఉండిపోతే..కోమటిరెడ్డికి తిరుగుండేది కాదు. మొత్తానికి కాంగ్రెస్ కు ఓట్లు పడటం కోమటిరెడ్డికి రిస్క్. మరి కొంటింగ్ ముగిసే సమయానికి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version