ఈనెల 24వ తారీఖున అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ సూచకంగా దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లో విందు ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరగబోయే ఈ విందుకు దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం కేంద్ర ప్రభుత్వం పంపింది.
వారిలో కేసీఆర్ కూడా ఉన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లో కెసిఆర్ ని పిలిచి జగన్ ని పిలవక పోవడంతో ఈ విషయం జాతీయ మరియు తెలుగు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో ఈనెల 25 వ తారీఖున కెసిఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో జగన్ ని ట్రంపు తో జరగబోయే విందుకు పిలవకపోవడం వెనుక కారణాల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
కొంతమంది జాతీయ స్థాయిలో ఉన్న నేతలు బీజేపీ తో టెర్మ్స్ బాగాలేవు కాబట్టి జగన్ ని పిలవలేదని కామెంట్ చేస్తుంటే మరోపక్క లేదు లేదు ఆఖరి నిమిషంలో పిలవచ్చు రహస్యంగా ఉంచారు అని అంటున్నారు. అయితే కెసిఆర్ ని ఈ విందుకు పిలవడం వెనక కారణం మాత్రం గతంలో ఇవాంక ట్రంప్ భారత పర్యటన చేపట్టినప్పుడు దగ్గరుండి కెసిఆర్ తీసుకోవటంతో తాజాగా ట్రంపు తో కెసిఆర్ కి విందు చేసే అవకాశం వచ్చినట్లు టాక్ వినబడుతోంది.