తుమ్మల రాజకీయం..ఖమ్మంలో కారుకు డేంజర్ సిగ్నల్స్.!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నట్లు కనిపించడం లేదు. మామూలుగానే జిల్లాలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి బలం తక్కువే. గత ఎన్నికల్లోనే 10 సీట్లకు ఒక సీటు గెలుచుకుంది. కానీ తర్వాత నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టి‌డి‌పి, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకుని ఖమ్మంపై పట్టు సాధించారు. అక్కడ నుంచి బి‌ఆర్‌ఎస్ పార్టీకి అంతా అనుకూలమనే పరిస్తితి కనిపించింది.

కానీ ఒక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సీన్ మారిపోయింది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో పాటు..పలువురు బి‌ఆర్‌ఎస్ నేతలని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. దీంతో ఖమ్మంలో మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఖమ్మంపై పట్టున్న సీనియర్ నేత, మాజీ మంతి తుమ్మల నాగేశ్వరరావు కూడా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. ఈయన కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీకి దూరమవుతారా? అనే సంకేతాలు వస్తున్నాయి. చాలా రోజుల నుంచి ఈయన పార్టీ మారతారనే ప్రచారం ఎక్కువ వస్తుంది.

కాకపోతే ఈయన్ని కే‌టి‌ఆర్ బుజ్జగిస్తుండటంతో ఆగుతున్నారని, అలాగే మళ్ళీ అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామని హామీ ఇస్తున్నారట. ఇలా తుమ్మలని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని చేసిన ఈసారి తుమ్మల ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నారు. అయితే పాలేరులో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే బి‌ఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ సీటు ఇచ్చేలా ఉంది. ఇక తుమ్మలకు ఈ సారి ఎమ్మెల్సీ ఇస్తామని బి‌ఆర్‌ఎస్ అధిష్టానం హామీ ఇస్తుందట. దానికి తుమ్మల సంసిద్ధంగా లేరట.

ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని డిసైడ్ అయ్యారట. బి‌ఆర్‌ఎస్ సీటు ఇస్తే ఓకే లేదంటే ఆయన కూడా పార్టీ జంప్ కొట్టేలా ఉన్నారు. అదే జరిగితే ఇంకా ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి భారీ దెబ్బ తప్పదు. పొంగులేటి అన్నట్లు ఒక్క సీటు గెలుచుకోవడం డౌట్ అనే పరిస్తితి.

Read more RELATED
Recommended to you

Exit mobile version