అమరావతి ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకుని హడావిడి చేస్తున్న tv 5 మూర్తి కి భారీ దెబ్బ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో రెండు నెలలుగా రైతులు పోరాడుతున్నారు. ఇదే సందర్భంలో చాలామంది వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలకు నిరసనలకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం అన్యాయమైనదని, రైతుల జీవితాలతో జగన్ ఆడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఎంతో కాలంగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అమరావతి రాజధాని విషయంలో ఎంతమంది వివిధ పార్టీల రాజకీయ నాయకులు జాతీయ స్థాయిలో ఉన్న వాళ్లు కూడా పర్యటించిన ఎవరికీ పెద్దగా పేరు రాలేదు.

కానీ టీవీ 5 ఛానెల్ లో జర్నలిస్టుగా పని చేస్తున్న టీవీ 5 మూర్తి మాత్రం ముందు నుండి అమరావతి ఉద్యమాన్ని నెత్తిన ఎత్తుకొని ఒక పక్క జర్నలిస్టుగా మరో పక్క పౌరుడిగా ప్రభుత్వాన్ని కడిగి పారేస్తూనారు. వీలైనంతవరకు టీవీ 5 ఛానెల్ లో అమరావతి రైతులకు సంబంధించి జరిగిన అన్యాయం గురించి డిబేట్ లు పెడుతూ చర్చల మీద చర్చలు చేస్తున్నారు.

 

ఇంత హడావిడి చేస్తున్న టీవీ5 జర్నలిస్ట్ మూర్తి కి ఇటీవల భారీ దెబ్బ పడినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది. మేటర్ లోకి వెళ్తే అమరావతి రాజధాని విషయంలో ఏపీ లో ఉన్న మీడియా ఛానల్ మొదటిలో బాగా స్పందించారు. అయితే తాజాగా రాను రాను అమరావతి విషయం ఒక పార్టీకి చెందినది అన్నట్టుగా మారిపోవడంతో ఇతర మీడియా అసలు సపోర్ట్ ఇవ్వట్లేదు. దీంతో టీవీ5 జర్నలిస్ట్ మూర్తి అమరావతి రాజధాని విషయంలో చేస్తున్న హడావిడి ని రాష్ట్రంలో పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version