కొడంగల్‌లో కొత్త ట్విస్ట్…రేవంత్‌కు ఇబ్బంది అవుతుందా..

-

కొడంగల్ నియోజకవర్గం పేరు చెబితే….అందరికీ రేవంత్ రెడ్డి పేరే గుర్తొస్తుంది. ఇక్కడ ఆయన రెండుసార్లే గెలిచిన సరే, ఊహించని విధంగా కొడంగల్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కొడంగల్ అంటే రేవంత్…. రేవంత్ అంటే కొడంగల్ అనే విధంగా పరిస్తితి ఉండేది. అలా పరిస్తితి ఉంది కాబట్టే 2018 ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ పనిగట్టుకుని మరీ రేవంత్ రెడ్డిని కొడంగల్ బరిలో ఓడగొట్టింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే మొదట నుంచి కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ నడిచేది. టి‌డి‌పి ఆవిర్భావించక అంటే 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు కాంగ్రెస్ గెలవగా, అయిదుసార్లు టి‌డి‌పి విజయం సాధించింది. ఇక 2009 ఎన్నికల నుంచి కొడంగల్‌లో రేవంత్ హవా మొదలైంది. 2009, 2014 ఎన్నికల్లో రేవంత్ టి‌డి‌పి తరుపున విజయం సాధిచారు. అలా రెండుసార్లు గెలిచిన రేవంత్, కొడంగల్‌ని తన కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఆ తర్వాత టి‌డి‌పిని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు 2018 ఎన్నికల్లో మాత్రం టి‌ఆర్‌ఎస్ భారీ షాక్ ఇచ్చింది. ఆయనపై టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. ఇక కొడంగల్‌లో ఓడిపోవడంతో రేవంత్…2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అలా అని రేవంత్…మల్కాజిగిరిలోనే అయ్యే అవకాశాలు లేవు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్, మళ్ళీ కొడంగల్‌లో బరిలోనే దిగనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ఇక పి‌సి‌సి అధ్యక్షుడుగా కూడా ఉండటంతో కొడంగల్‌లో రేవంత్ విజయం ప్రతిష్టాత్మకం కానుంది. ఖచ్చితంగా ఇక్కడ రేవంత్‌ ఇక్కడ గెలవాలి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడుప్పుడే ఇక్కడ టి‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇదే సమయంలో బి‌జే‌పి సైతం కొడంగల్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇక్కడ నెక్స్ట్ బలమైన అభ్యర్ధిని నిలపడానికి చూస్తుంది. అలాంటప్పుడు బి‌జే‌పి ఒకవేళ గెలవకపోయిన ఓట్లు చీలిస్తే, రేవంత్‌కు ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి నెక్స్ట్ కొడంగల్ రాజకీయాలు ఎలా ఉంటాయో?

Read more RELATED
Recommended to you

Exit mobile version