ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ దూకుడు పెంచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూపీలో ఎన్నికలు జరుగనున్నాయి. అందు కోసం కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ యూపీలో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. వినూత్న హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దీంట్లో భాగంగానే సరికొత్త హామీని ఓటర్ల ముందుంచారు. తాము అధికారంలోకి వస్తే చదువుకుంటున్న బాలికలకు స్మార్ట్ ఫోన్లను, స్కూటీలను ఇవ్వనున్నాట్లు వెల్లడించారు. దీనితో పాటు మహిళలను ఆకట్టుకునేందుకు మరిన్ని హామీలను ప్రజల ముందుంచారు. కాంగ్రెస్ యూపీలో అధికారంలోకి వస్తే వితంతువుకు నెలకు రూ. 1000 ఫించన్ ఇస్తామని, బస్సుల్లో మహిళలకు ఫ్రిగా ప్రయాణం, మూడు గ్యాస్ సిలండర్లను ఉచితంగా మహిళలకు అందిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకే కేటాయిస్తామని ఇది వరకు కాంగ్రెస్ వెల్లడించింది.
వచ్చే ఏడాది జరుగబోయే యూపీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. గతంలో లఖీంపూన్ ఖేరీ ఘటనలో అధికార పక్షం బీజేపీని విమర్శిస్తూ నిరసనలు నిర్వహించారు. రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు హామీలతో ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.