నన్ను బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో ఉంచాలని చూస్తున్నారు, చంద్రబాబుపై వంశీ ఫైర్…!

-

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదన్న ఆయన ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు అప్పుడే ఉద్యమాలు దీక్షలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అకాల వర్షాల కారణంగానే ఇసుకను తీయలేమని అభిప్రాయపడిన వంశీ… వర్షాలు పడినప్పుడు ఇసుకను తీసే శక్తి ఎవరికి లేదన్నారు. ఆ శక్తి చంద్రబాబు నాయుడు గారికి దేవుడు ప్రసాదించాలని వంశీ ఎద్దేవా చేశారు.

ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పని చేసే సమర్ధించాలని హితవు పలికారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎప్పుడు చేసామని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వానికి అయినా కొంత సమయం కావాలని అభిప్రాయపడ్డారు వంశీ. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలి, డబ్బులు లేని వాళ్ళు తెలుగు చదువు కోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర పోషించలేకపోతున్నారని వంశీ మండిపడ్డారు.

పెద ప్రజలకు ఇంగ్లీష్ చదువుకోవాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తామన్నారు వంశీ…

డబ్బున్న వారికి ఒకరకంగా, డబ్బులు లేని వారికి చదువు ఒకరకంగా ఉంటుందా…? అని నిలదీశారు. కొత్త ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వాలని హితవు పలికారు. ఎన్నికకు ముందు చంద్రబాబు ఒక మాట మాట్లాడతారు, టీడీపీపై ప్రజలకు విశ్వాసం పోతుందని వంశీ వ్యాఖ్యానించారు. 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పార్టీలో కనపడలేదని ప్రశ్నించారు. తనను బ్లాక్ మెయిల్ చేసి పార్టీ లో ఉంచాలని చూస్తున్నారు అంటూ వంశీ మండిపడ్డారు. తెలంగాణా ఆర్టీసీ ఉద్యమంలో టీడీపీ ఎందుకు పాల్గొనడం లేదని వంశీ ప్రశ్నించారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని వాళ్ళు తనను విమర్శిస్తే పడాలా అని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version