తాడేపల్లి ప్యాలెస్‌, లోటస్‌పాండ్‌లకు వైఎస్‌ పేరు ఎందుకు పెట్టలేదు : అనిత

-

ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టినట్లు.. జగన్‌ తన తాడేపల్లి ప్యాలెస్‌, లోటస్‌పాండ్‌ నివాసాలకు వైఎస్‌ పేరు ఎందుకు పెట్టలేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని, ఎప్పుడూ లేనిది ఇప్పుడు విశాఖలో వికేంద్రీకరణ పేరుతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎందుకు పెట్టారని నిలదీశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ నాయకులు విశాఖలో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

 

సంచలనం సృష్టిస్తున్న దిల్లీ మద్యం స్కామ్‌ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ దొంగల ముఠా కొత్త ఎత్తుగడ వేసిందని, ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చారని అనిత ఆరోపించారు. మద్యం స్కామ్‌లో సీఎం జగన్‌ భార్య భారతిరెడ్డితో పాటు వైసీపీ ముఖ్యనాయకుల పాత్ర ఉందని, వైసీపీ నాయకులు, అనుచరుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుగుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆయా అంశాలను కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కుతంత్రానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version