అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికమని… అలాంటి అనాగరికుడునీ రాజుగా ఎలా గుర్తిస్తామని మండిపడ్డారు. కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసేవాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటాడని ప్రశ్నించారు. చంద్రబాబు పుణ్యమా అంటూ ఎమ్మెల్యే, మంత్రిగా అశోక్ గజపతిరాజు చెలామణి అయ్యారని.. సింహాచలం దేవస్థానంలో పదివేల కోట్లు రూపాయలు విలువైన 830 ఎకరాల భూములు లెక్కలు మాయం అయ్యాయని ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యమా… అశోక్ స్వామ్యమా…? అని ప్రశ్నించారు.
దేవుడు సొమ్ము తిన్న ఎవ్వరికైనా ఇబ్బందులు తప్పవని.. చట్టాన్ని వ్యతిరేకించిన అందరికి శిక్ష తప్పదన్నారు. రికార్డులు తారుమారు చేశారని.. రాజులైతే చట్టానికి అతీతులా ? అని నిలదీశారు. గతంలో ఇఓగా పని చేసిన రామచంద్రమోహన్ హయాంలో 830 ఎకరాలు దేవస్థానం భూమి రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. కిందస్థాయి అధికారి ఎవ్వరి అనుమతి లేకుండా పదివేలకోట్లు రూపాయలు అవినితికి పాల్పాడ్డారని పేర్కొన్నారు. మహిళ కమిషన్ కు సంచాయిత ఫిర్యాదు చేశారని…మాన్సస్ బైలానే కారణం అయితే సమీక్షిస్తామన్నారు.