విజయవాడ : ప్రముఖ వ్యాపార వేత్త రాహుల్ హత్య కేసు లో పురోగతి లభించింది. రాహుల్ ని చంపింది కోరాడ విజయే అని నిర్ధారణ కొచ్చారు విజయవాడ పోలీసులు. శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారణకు వచ్చారు పోలీసులు. రాహుల్ తండ్రి ఫిర్యాదుతో పద్మశ్రీ, గాయత్రి పేర్లను కేసులో చేర్చారు పోలీసులు. కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా కేసు విచారణ చేశారు విజయవాడ పోలీసులు.
కంపెనీ నుంచి హత్య ప్రదేశానికి ట్రావెల్ చేసిన సెల్‌ఫోన్ డేటాతో విచారణ చేయగా.. హత్యా ప్రాంతంలో కోరాడ విజయ్ ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్నారు పోలీసులు. సెటిల్‌మెంట్ చేసు కుందామని అనుచరుల తో రాహుల్ ను పిలిపించాడు కోరాడ విజయ్. కంపెనీ లో 30 శాతం వాటా డబ్బుల కోసం రాహుల్ పై కోరాడ విజయ్ ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యా ప్రదేశంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులు త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.