పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి హెచ్చరికలు చేసారు. ముస్లిం లను హెచ్చరిస్తూ ఆయన ఉత్తర కర్ణాటకలోని బళ్ళారిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు చేసారు. “మీరు కేవలం 15 శాతం ఉన్నప్పుడే మేము జనాభాలో 80 శాతం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. మీరు కేవలం మైనారిటీ మాత్రమే, మీ అందరికీ వ్యతిరేకంగా మెజారిటీ వీధుల్లోకి వస్తే ఏమి జరుగుతుందో మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను”
సోమశేకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడ౦తో దుమారం రేగింది. వివాదాస్పదంగా మరీనా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై దక్షిణ ఎంపి తేజస్వి సూర్య చేసిన ‘పంక్చర్వాల్లా’ అనే వ్యాఖ్యను సమర్ధించారు. “తేజస్వి సూర్యుడు సరిగ్గా మాట్లాడారు. ఆ నిరసనకారులలో ఎక్కువమంది పంక్చర్వాల్లా మరియు నిరక్షరాస్యులు, వారు ఏమి చెప్పినా నమ్ముతారు. ప్రతిపక్ష కాంగ్రెస్ వారి మనస్సులను “కలుషితం” చేస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేసారు.
కర్ణాటకలో ప్రజా ఆస్తులను నాశనం చేసే నిరసనకారులకు కూడా ఆయన హెచ్చరికలు జారి చేసారు. గత నెలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హింస చెలరేగింది. డిసెంబర్ 19 న మంగళూరులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపారు. ఇక ఇదిలా ఉంటే ఈ చట్టం విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇది దుమారం రేపినా సరే కేంద్రం మాత్రం వెనక్కు తగ్గడం లేదు.