ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో టీం ఇండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లి, గొప్ప ఆటగాడా…? స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గొప్ప ఆటగాడా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది కాస్త కష్టమే. పోటీ పడి మరీ ఆడుతున్న ఈ ఇద్దరు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో దూసుకుపోతున్నారు. ఒకరిని మించి మరొకరు తమ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ,
రోహిత్, కోహ్లి ఇద్దరు కూడా మూడు ఫార్మాట్లలో దూకుడుగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ వేగంగా ఆడుతుంటే కోహ్లి మాత్రం నిదానంగా ఆడటంతో పాటు నిలకడతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం శ్రీలంకతో టీం ఇండియా తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి రోహిత్ రికార్డ్ ని టార్గెట్ చేసాడు. టీ20ల్లో శ్రీలంకతో ఆదివారం జరగనున్న తొలి టీ20లో కోహ్లీ ఒక్క పరుగు చేస్తే పొట్టి ఫార్మాట్ లో,
అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. రోహిత్ 104 టీ20 మ్యాచులలో 2,633 పరుగులు చేసి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా… కోహ్లీ 75 మ్యాచుల్లోనే 2,633 పరుగులు చేసి సమానంగా ఉన్నాడు. ఆదివారం జరగనున్న మ్యాచ్ లో ఒక్క పరుగు సాధిస్తే చాలు. ఇక ఇదిలా ఉంటే విండీస్ తో సీరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఊపు కొనసాగించాలని భావిస్తుంది.