తెలంగాణ రాజకీయాల్లో మూడు ముక్కలాట నడుస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ వన్ వే లో రాజకీయం చేసింది…అంటే ప్రతిపక్షాలని తోక్కేసి కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనిపించిది. కానీ అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకోవడంతో ట్రైయాంగిల్ ఫైట్ మొదలైంది…మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతూ..తెలంగాణ రాజకీయాలని హీటెక్కిస్తున్నాయి. ఎవరికి వారు అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు.
ఇదే క్రమంలో మూడు పార్టీల్లో సీఎం అభ్యర్ధిపై కూడా తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. సాధారణంగా టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి..ఆ పార్టీలో సీఎం అనే చర్చ పెద్దగా ఉండదు. ఎందుకంటే కేసీఆర్ ని దాటి సీఎం సీటు ఎవరికి దక్కదు. అయితే ఇప్పటికే ఆయన రెండు సార్లు సీఎంగా చేశారు. ఇక మూడోసారి గాని టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ తప్పుకుని, తన తనయుడు కేటీఆర్ ని సీఎం చేస్తారని ప్రచారం జరుగుతుంది. కాకపోతే కేటీఆర్ మాత్రమే కాదు కవిత కూడా సీఎం రేసులో ఉన్నారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అటు హరీష్ రావు కూడా సీఎం సీటుపై కన్నేశారని అంటున్నాయి. అంటే టీఆర్ఎస్ లో కూడా సీఎం సీటులో చాలా పోటీ ఉంది.
ఇటు కాంగ్రెస్ విషయానికొస్తే సీఎం రేసులో చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు..అవకాశం వస్తే తమకు సీఎం సీటు కావాలని..జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, షబ్బీర్ అలీ లాంటి వారు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే…అధిష్టానం ఎవరిని సీఎం చేస్తుందో క్లారిటీ లేదు.
అటు బీజేపీలో కూడా సీఎం రేసు నడుస్తోంది…ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ లాంటి వారు సీఎం రేసులో ఉన్నారు. ఇంకా పలువురు సీనియర్లు సైతం సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈ మూడు ముక్కలాటలో ఎవరు సీఎం అవుతారో చూడాలి.