ఆమె ఎలాగూ అదే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. అయినప్పటికీ.. ఆ నియోజకవర్గంపైనే అందరి చూపు ఉంది. ఈసారి ఆమె గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు భాను ప్రకాశ్‌తో తలపడ్డారు. 2014లో గాలితోనే ఢీకొన్నారు. విజయం సాధించారు.
ఏపీలో తొలి విడతలోనే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కానీ.. ఫలితాలపై మాత్రం ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ నెలకొన్నది. ఏ పార్టీ గెలుస్తుందో? ఏ పార్టీ ఓడిపోతుందో? అసలు ఏం జరగబోతుందో అని అంతా టెన్షన్‌తో ఎదురు చూస్తున్నారు. అయితే ఫలితాలు మే 23న వెలువడనున్నప్పటికీ.. కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. అని చెప్పేస్తున్నారు. అయితే.. మిగితా నియోజకవర్గాలను పక్కనబెడితే.. ఒక్క నియోజకవర్గంపై మాత్రం అందరికీ ఆసక్తి పెరిగింది. అది చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం.
ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి జబర్దస్త్ రోజా పోటీ చేయడమే. ఆమె ఎలాగూ అదే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. అయినప్పటికీ.. ఆ నియోజకవర్గంపైనే అందరి చూపు ఉంది. ఈసారి ఆమె గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు భాను ప్రకాశ్‌తో తలపడ్డారు. 2014లో గాలితోనే ఢీకొన్నారు. విజయం సాధించారు.
అయితే.. ఏపీలో అధికారంలో ఉన్నది టీడీపీ పార్టీ అయినప్పటికీ.. రోజా వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆమె తన నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేపట్టారు. 4 రూపాయలకే రోజా క్యాంటీన్లను ప్రారంభించారు. మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించారు. తన నియోజకవర్గంలో ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు పసుపు, కుంకుమ పేరుతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పేరుపేరునా పిలిచి.. వాళ్లందరినీ తనవైపుకు తిప్పుకోవడంలో రోజా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అంతే కాదు.. ఆమె వివాదాలకు కూడా చాలా దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా.. వెంటనే అక్కడికి చేరుకొని వాళ్ల సమస్యలను తీర్చడంలో ముందున్న రోజాకే మళ్లీ నగరి నియోజకవర్గం ప్రజలు పట్టం కట్టనున్నారట.
రోజా పక్కాగా ఇక్కడ గెలుస్తుందట. గాలి సెంటిమెంట్ నగరిలో అస్సలు పనిచేయదని తేల్చేశారు రాజకీయ విశ్లేషకులు. గాలి కుటుంబంలో తగాదాలు, చంద్రబాబు గాలి కుటుంబానికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించడం, చివరి నిమిషంలో గాలి కుటుంబానికి టికెట్ ఇవ్వడం.. ఇవన్నీ రోజాకు కలిసొచ్చాయని.. ఆమె చేసిన మంచి పనులతో పాటు ఆమె సినీ గ్లామర్ కూడా ఈ ఎన్నికల్లో బాగానే ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం.. నగరిలో ఏం జరుగుతుందో తెలియాలంటే మే 23 దాకా ఆగాల్సిందే.