తెలంగాణలో ఎప్పుడైతే గత ఎంపీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై సంచలన విజయం సాధించారో అప్పటి నుంచే ధర్మపురి అరవింద్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక మొదటి నుంచి దూకుడు గానే ఉండే ఈయన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక వీరిద్దరూ కలిసే పార్టీలో చక్రం తిప్పారు. ఏ పని అయినా వీరిద్దరూ కలిసే వ్యూహాలు రచించేవారు. బండి సంజయ్ ప్రెస్ మీట్ పెడితే కచ్చితంగా ధర్మపురి ఉండేవాడు. ఇక మొదటి నుంచి బండిని ఎవరైనా ఏమైనా అంటే ధర్మపురి వెంటనే కౌంటర్లు వేసేవాడు.
వీరిద్దరూ కలిసి దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎంతలా ప్రభావం చూపారో అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలో పార్టీ ఇంతలా బలపడటానికి కూడా వారిద్దరూ కలిసే చేసే వ్యూహాలే కారణమని చెప్పాలి. ఇక ఇలాంటి కారణాలతో వారిద్దరి పేరు తెలంగాణలోని అన్ని పార్టీల్లో ప్రభావం చూపించదనే చెప్పాలి.
అయితే అంతలా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండే ధర్మపురి అరవింద్ అనూహ్యంగా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఈటల రాజేందర్ కాషాయ జెండా కప్పుకున్నారో అప్పటి నుంచే అరవింద్ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. ఇక ఈటల రాజేందర్ రావడంతో కొన్ని గ్రూపు రాజకీయాలు తెరమీదకు వచ్చాయని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ధర్మపురి అరవింద్ బండి సంజయ్‌కు దూరంగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గానే ఆయన అన్న కూడా కాంగ్రెస్‌లో చేరడంతో మరింత సందిగ్ధంలో పడ్డారు అరవింద్. మరి ఆయన ఎలాటి నిర్ణయం తీసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.