ప్ర‌భుత్వ‌మే అంతా చేస్తే GHMC ఎన్నిక‌ల‌ను ఎందుకు నిర్వ‌హించారు – బండి సంజ‌య్

-

GHMC పాల‌క వ‌ర్గం ఎన్నిక అయి ఏడాది గ‌డుస్తున్న ఇంత వ‌ర‌కు జ‌న‌ర‌ల్ బాడీ సమావేశం నిర్వ‌హిస్త లేర‌ని ప్ర‌భుత్వా న్ని ఎంపీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. GHMC నిర్ణ‌యాల ను కూడా ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యిస్తే GHMC కి ఎందుకు ఎన్నిక‌లు నిర్వ‌హించినట్టు అని అన్నారు. అలాగే GHMC బీజేపీ కార్పొరేట‌ర్ల ను ఎందుకు అరెస్టు చేశార‌ని అన్నారు.

వారి అరెస్టు ను బండి సంజ‌య్ ఖండించారు. త‌క్ష‌ణ‌మే కార్పొరేట‌ర్లు విడుదల చేయాల‌ని డిమాండ్ చేశాడు. ప్ర‌భుత్వ‌మే GHMC ని న‌డ‌పాల‌ను కుంటే అసలు GHMC కి ఎన్నికలు ఎందు కు నిర్వ‌హించార‌ని అన్నారు. అలాగే రాజ‌కీయా కక్ష తో రాష్ట్ర, GHMC అభివృద్ధి ని విస్మ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. కాగ ఈ రోజు GHMC జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం నిర్వ‌హించాల‌ని బీజేపీ కార్పొరేట‌ర్లు జీహెచ్ ఎంసీ భ‌వ‌నాన్ని ముట్ట‌డించారు. అయితే ఈ ఆందోళ‌న లో పాల్గొన్న బీజేపీ కార్పొరేట‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version