మరో ఆసక్తికరమైన పోరుకు సిద్దమవుతున్న పార్టీలు.. ప్రభుత్వ వ్యతిరేకత జగన్ కు కలిసొస్తుందా..?

-

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.. విమర్శలు, ప్రతి విమర్శలతో పాలిటిక్స్ పీక్స్ కు వెళ్లాయి.. మరోసారి ఏపీలో ఎన్నికల వాతావరణం రాబోతుంది.. మళ్లీ రాజకీయం హీటెక్కబోతోంది.. కూటమి అభ్యర్దులను అధినేత పైనల్ చేశారు.. త్యాగరాజులకు టిక్కెట్లు ఇచ్చి.. శాసనమండలికి రప్పించుకోవాలని చంద్రబాబుకు పట్టుదలతో ఉన్నారు.. ఇక వైసీపీ కూడా బరిలోకి దిగబోతోంది.. ఇంతకీ జగన్ ఏ స్టాటజీతో అభ్యర్దులను నిలబెట్టుబోతున్నారో చూద్దాం..

త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించాల్సిన ఈ ఎలక్షన్స్‌.. అధికార, ప్రతిపక్షాలకు సవాల్‌గా మారాయి. ఫ్యాన్‌ పార్టీ అధికార పార్టీని చిత్తు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అధికార పార్టీ కూడా తగ్గేదేలా అన్నట్లుగా పై ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్దిని చిత్తు చేసేందుకు సిద్దమైంది.. దీంతో ఏపీలో మరోసారి పొలిటికల్ హీట్ తప్పదనే భావన వ్యక్తమవుతోంది..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయంతో కూటమి అధికారంలోకి రాగా.. వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో అధికారం మారింది.. రాజకీయం కూడా మారింది. త్వరలో జరుగబోయే రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు… నిరాశలో ఉన్న వైసీపీకి, జనాలు తమవైపే ఉన్నారంటున్న టీడీపీకి అగ్నిపరీక్షగా మారబోతుందనే చర్చ జరుగుతోంది. రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయ్. దీంతో ఈ పోరు మరింత ఇంట్రస్టింగ్ గా మారింది..

గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా అభ్యర్థిగా.. పేరాబత్తుల రాజశేఖర్ ను ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది.. వారి గెలుపు కోసం కృషి చెయ్యాలంటూ కూటమి నేతలకు చంద్రబాబునాయుడితో పాటు.. మంత్రులు విజ్ణప్తి చేస్తున్నారు.. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని ఆదేశిస్తున్నారు కూడా..

వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది.. వందరోజుల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని వైసీపీ చెబుతున్న నేపథ్యంలో.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. గెలవాలని చూస్తోంది.. అందులో భాగంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పొన్నూరు గౌతంరెడ్డి పేరు ప్రకటించింది. మరో అభ్యర్దిని ప్రకటించాల్సి ఉంది.. ఈ ఎన్నికల్లో ఓటేసేవారందరూ పట్టభద్రులు కావడంతో.. వారు అసంతృప్తితో ఉన్నారని.. గత నాలుగు నెలల పాలన బాగలేదని వైసీపీ చెబుతోంది.. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులు గెలిస్తే మాత్రం.. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే క్లారిటీ వస్తుంది.. మరో పక్క టీడీపీకి కూడా ఇది అగ్నిపరీక్ష లాంటిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version