జగన్ ప్రధాని: మంత్రులుగా ఛాన్స్ వస్తుందా?

-

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సీఎం జగన్ ( CM Jagan ) సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లో రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. అంటే మరో నాలుగైదు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. దీంతో మంత్రులుగా ఛాన్స్ కొట్టేయాలని పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు.

Ys-Jaganmohan-Reddy

ఈ క్రమంలోనే జగన్‌పై కొందరు ఎమ్మెల్యేలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జోగి రమేష్, మేకా వెంకట ప్రతాప్‌లు జగన్‌ని ఓ రేంజ్‌లో పొగిడారు. జగన్‌కు ప్రధాని అయ్యే అవకాశం ఉందని కూడా మాట్లాడేశారు. మరో 30 ఏళ్ళు సీఎంగా జగన్ ఉంటారని, నాలుగు బాషలు మాట్లాడే జగన్‌కు ప్రధాని అయ్యే అర్హత ఉందని మాట్లాడారు.

అయితే ఈ పొగడ్తలు మరీ లిమిట్ దాటేశాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్‌కు భజన చేస్తేనే మంత్రి పదవులు వస్తాయనే ఉద్దేశంతో, ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లు కనిపిస్తున్నారని చెబుతున్నారు. అయితే జోగి రమేష్, మేకా ప్రతాప్‌లు వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో మంత్రులుగా ఛాన్స్ కొట్టేయాలని ఇద్దరు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జోగి రమేష్ అయితే ఓ రేంజ్‌లో జగన్‌ని పొగడటం చేస్తున్నారు.  గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కూడా తెలిసిందే.

అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఛాన్స్ కొట్టేయాలని ఉద్దేశంతో రమేష్ ఉన్నారని తెలుస్తోంది. అటు సీనియర్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు ఉన్నారని అంటున్నారు. అందుకే ఓ రేంజ్‌లో జగన్‌కు భజన చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఎమ్మెల్యేలకు జగన్ ఎలాంటి ఛాన్స్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version