పెనమలూరు టిడిపిలో మొదలైన రచ్చ.. చిచ్చు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే..

-

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయ రచ్చ మొదలైంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి టిడిపిలో చేరబోతుండడంతో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం ఆందోళనలో ఉంది.. పార్థసారథి రాకను బోడే వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. అధికారంలో ఉన్న సమయంలో తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించిన పార్థసారథిని టిడిపిలోకి తీసుకోవద్దని మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ హైకమాండ్ ను హెచ్చరిస్తున్నారు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని వెల్లడించిన తరువాతే దీనిపై పూర్తిగా స్పందిస్తానని కార్యకర్తలతో ప్రసాద్ చెప్పినట్లు చర్చ నడుస్తుంది..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టlo నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు నేపథ్యంలో పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారధిని వేరే చోటకు పంపించేందుకు అధిష్టానం కసరత్తు చేసింది.. ఇదే విషయం పై ఎమ్మెల్యే పార్థసారథికి కూడా వైసీపీ అధిష్టానం చర్చలు జరిపింది.. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పార్థసారధి గత కొన్ని నెలలుగా అధిష్టానం పై అసంతృప్తితో ఉన్నారు.. ఈ క్రమంలో ఇటీవల జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో సైతం తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు.. దీంతో పార్థసారథి పార్టీ మారతారని ప్రచారం అప్పటి నుంచే ప్రారంభమైంది..

పార్థసారథిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసిపి అధిష్టానం చెప్పడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో నిన్న సాయంత్రం భేటీ అయ్యారు.. సుమారు అరగంట పాటు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై వారిద్దరూ చర్చించుకున్నారు.. పార్టీలో చేరేందుకు పార్థసారథి సముఖత వ్యక్తం చేయడంతో మరోసారి పెనమలూరు నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది.. ఇదే సమయంలో ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బోడే ప్రసాద్ పార్థసారథి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. తనకు టికెట్ ఇవ్వకపోతే తాడోపేడో తేల్చుకుంటానని కార్యకర్తలు వద్ద బోడె ప్రసాద్ చెబుతున్నారని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.. మొత్తంగా పార్థసారథి రాక టిడిపిలో రచ్చలకు కారణం అవుతుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version