టీడీపీలోకి సునీత..వైసీపీ ఫేక్..వివేకా కేసులో తిప్పలు.!

-

వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురుని సి‌బి‌ఐ అరెస్ట్ చేసింది. ఇదే క్రమంలో జగన్ మరో బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఇక జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి సైతం అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కానీ అవినాష్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో హైకోర్టు 25వ తేదీ వరకు అవినాష్‌ని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇస్తే..దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టుకు వెళ్లారు.

ఇక సుప్రీంలో అవినాష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ చేయవద్దని సి‌బి‌ఐని ఆదేశించలేమని చెప్పింది. దీంతో ఏ క్షణంలోనైనా అవినాష్ అరెస్ట్ జరగవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ అంశం వైసీపీకి రాజకీయంగా మైనస్ అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల ముందు వివేకాని చంద్రబాబు, టి‌డి‌పి నేతలు చంపించారని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ అంశం రాజకీయంగా వైసీపీకి ప్లస్..టి‌డి‌పికి మైనస్ అయ్యాయి.

అయితే ఇప్పుడు అదే అంశం రివర్స్ అవుతుంది..ఈ క్రమంలో వైసీపీ సరికొత్త ఎత్తులతో ముందుకొస్తుంది. ఇప్పటికే సునీత..చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా సునీత…టి‌డి‌పిలో చేరుతున్నారంటూ..ఆమె ఫోటోలతో టి‌డి‌పి ఫ్లెక్సీల పేరిట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఈ అంశంపై టి‌డి‌పి స్పందించింది. “ వివేకా హత్య కేసు మెడకు చుట్టుకుంటుంటే ఊపిరాడని జగన్ & కోకు అడ్డమైన ఆలోచనలు వస్తున్నాయి. అందుకే ఇలా వివేకా కూతురు సునీత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ఫేక్ పోస్టర్లు తయారుచేసి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు. జగన్ రెడ్డి ఫేక్ బతుకు అందరికీ తెలిసిందే కదా.” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్ పేరిట పోస్ట్ పెట్టారు. అంటే సునీత టి‌డి‌పిలో చేరడం అనేది ఫేక్ అని, వివేకా కేసుని డైవర్ట్ చేయడానికి ఇదంతా వైసీపీ వేస్తున్న ఎత్తులు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version