దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాల్సిందే – మహేష్ కుమార్ గౌడ్

-

నేడు ఇందిరా భవన్ లో ఓబీసీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల కోసం పోరాడే వ్యక్తి విహెచ్ అని కొనియాడారు. తెలంగాణ బీసీలలో ఐక్యత కొరవడిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మతం పేరుతో బిజెపి వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

మైనారిటీల రిజర్వేషన్ తీసేసి బీసీలకు ఇస్తామని అమిత్ షా చెప్తున్నారని.. కుల గణనను బిజెపి వాళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మైనారిటీలలో వెనుకబడిన ప్రజలకే రిజర్వేషన్ ఇచ్చారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీల కుల గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ చెప్పారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కెసిఆర్ ఒక్కరికే తెలుసన్నారు మహేష్ కుమార్ గౌడ్. కుల గణన కేసీఆర్ చేయించుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీ కుల గణన జరగాల్సిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీనే బీసీలకు న్యాయం చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version