మళ్ళీ మళ్ళీ అవే విమర్శలు..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు..టిడిపిని లాక్కున్నారు..ఇవే కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి చంద్రబాబుపై చేస్తున్న విమర్శలు. ప్రతిసారి మీడియా ముందుకు రావడం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని మాట్లాడటం. ఇలా పదే పదే మాట్లాడటం వల్ల చంద్రబాబుకు ఏమైనా నష్టం జరుగుతుందా? లేదా వైసీపీకి అదనంగా ఒక ఓటు ఎక్కువ వస్తుందా? అంటే అసలు ఏమి ఒరగదనే చెప్పవచ్చు.
ఎప్పుడో 1995లో అనివార్య పరిస్తితుల్లో ఎన్టీఆర్ ని గద్దె దించి టిడిపి పగ్గాలు చంద్రబాబు తీసుకున్నారు. అలాగే బాబు సిఎం అయ్యారు. ఇక అప్పుడే బాబు వెన్నుపోటు పొడిచారని అనుకుంటే 1999 ఎన్నికల్లో బాబుని ప్రజలు తిరస్కరించాలి..కానీ అప్పుడు బాబుని మళ్ళీ సిఎం చేశారు. ఆ తర్వాత బాబు ఓడిపోయినా సరే ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారు. టిడిపి బలంగానే ఉంది. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి బలంగానే నిలబడింది. మళ్ళీ 2014 ఎన్నికల్లో గెలిచింది.
ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయినా సరే..మళ్ళీ నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ టిడిపి మళ్ళీ గెలిచే దిశగా వెళుతుంది. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ కొడాలి వెన్నుపోటు అనడం వల్ల టిడిపికి ఓటు వేద్దామని అనుకున్నవారు..తమ ఆలోచనని మార్చుకుని వైసీపీకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి క్రాస్ ఓటు చేశారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో టిడిపికి 4 సీట్లు మాత్రమే వస్తాయని కొడాలి అంటున్నారు. అలాంటప్పుడు టిడిపికి చెందిన నలుగురు, జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యేని వైసీపీ లాక్కుంది. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుచుకునే సీట్లు ఐదు మాత్రమే అని టిడిపి కౌంటర్లు ఇస్తుంది. కాబట్టి కొడాలి అనడం వల్ల టిడిపికి పోయేదేమీ లేదని అంటున్నారు.