లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పథకాలను అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే పలు కారణాలతో కొన్ని పాలసీలను కొన్ని రోజుల తర్వాత నిలిపివేస్తుంది.. మరి కొన్ని పథకాలను పూర్తిగా ఆపివేస్తుందని సమాచారం..గతేడాది లాంఛ్ చేసిన ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్‌ను 2023 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ప్రకటించింది. అంటే ఈ పాలసీ 2023 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉండదు.
ఇక ధన వర్ష లిమిటెడ్ ప్లాన్ అని, ఇంకొన్ని రోజులే ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని, 2023 మార్చి 31 లోపు కొనుగోలు చేయొచ్చని https://licindia.in/ వెబ్సైట్లో లేదా సమీపంలోనే బ్రాంచ్‌లో లేదా ఎల్ఐసీ ఏజెంట్ దగ్గర ఈ పాలసీ తీసుకోవచ్చని ఎల్ఐసీ ట్వీట్ చేసింది..వివరాల్లోకి వెళితే..ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. పాలసీహోల్డర్లకు రక్షణతో పాటు సేవింగ్స్ కూడా అందించడం ఈ పాలసీ ప్రత్యేకత. పాలసీహోల్డర్ మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది…
ఈ పాలసీలో పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలసీ రెండు ఆప్షన్స్‌తో లభిస్తుంది. పాలసీ టర్మ్ కూడా వేర్వేరుగా ఉంటుంది. 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీకి కనీస వయస్సు 3 ఏళ్లు కాగా, 10 ఏళ్ల టర్మ్‌తో పాలసీకి కనీస వయస్సు 10 ఏళ్లు.. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 15 ఏళ్ల టర్మ్‌తో ఆప్షన్ 2 ఎంచుకొని ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్ తీసుకున్నారనుకుందాం. సింగిల్ ప్రీమియం జీఎస్టీతో కలిపి రూ.8,34,652 చెల్లించాలి. బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10,00,000. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ రూ.79,87,000 లభిస్తుంది.
బెనిఫిట్స్ చూస్తే..మెచ్యూరిటీ సమయంలో రూ.16,00,000 బెనిఫిట్ లభిస్తుంది. గ్యారెంటీడ్ అడిషన్స్‌తో డెత్ బెనిఫిట్ రూ.85 లక్షల వరకు లభిస్తుంది. ఒకవేళ బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.12 లక్షలతో తీసుకుంటే రూ.1 కోటి వరకు బెనిఫిట్ పొందొచ్చు.. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని అందరికి తెలిసిందే..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. ఈ పాలసీని ఎల్ఐసీ ఏజెంట్ల దగ్గర, ఎల్ఐసీ కార్యాలయాల్లో తీసుకోవచ్చు.. అంతేకాదు ఆన్లైన్లో కూడా పొందోచ్చు..