మళ్లీ వైసీపీకే పట్టం… టైమ్స్ నౌ సంస్థ సర్వేలో వెల్లడి

-

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి ప్రభావం పెద్దగా ఉండబోదని తేల్చేసింది టైమ్స్ నౌ సంస్థ.ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలొస్తే ప్రజలు ఎవరిని గెలిపిస్తారనే అంశంపై ఈ సంస్థ సర్వే నిర్వహించగా ఈసారి కూడా వైఎస్సార్‌సీపీ అత్యధిక లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్‌ స్థానాలకు గాను అధికార వైఎస్సార్‌సీపీ 19 స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుందని స్పష్టం చేసింది. సామాజిక వర్గాల, వయస్సు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వయోధిక వృద్ధులు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్‌ను తీసుకుంది.

టీడీపీ-జనసేన’ ఎటువంటి ప్రభావం చూపకుండా కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుందని టౌమ్స్‌నౌ సర్వే పేర్కొంది.ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పనితీరుకు మళ్లీ పట్టం ప్రజలు కడతారు అని తేల్చింది టైమ్స్‌ నౌ సర్వే సంస్థ. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పనితీరు పట్ల 38 శాతం మంది అత్యద్భుతం అని ఈ సర్వేలో కితాబు ఇచ్చారు. మరో 26 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన బాగుందని ప్రశంసించారు. ఈ రెండు కలిపితే ఏకంగా 64 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తేల్చింది.

లోక్‌సభ సీట్ల మాదిరిగానే అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో వైసీపీ హవా మళ్లీ కొనసాగుతుందని తేల్చేసింది టైమ్స్ నౌ. ఇక్కడా క్లీన్ స్వీప్ నమోదవుతుందని చెప్పింది.ఒక్కో లోక్‌సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీకి 133 సీట్లు లభిస్తాయని చెప్పింది. ఈ స్థాయి భారీ మెజారిటీతో మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందని వెల్లడించింది.ఈసారి కూడా ఏపీలో వైసీపీకి తిరుగులేదని తేల్చి చెప్పేసింది. ఇక ఇటీవల పలు సంస్థలు ఇస్తున్న సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడంతో ప్రతిపక్ష పార్టీలకు కంటి మీద కునుకులేకుండా పోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version