బీఆర్‌ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి-యోగి ఆదిత్యనాథ్‌

-

తన ప్రసంగంతో తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నారు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. తెలంగాణ రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలతో పాటు జనాదరణ కలిగిన నేతలు తెలంగాణ రాష్ర్టానికి క్యూ కట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోమ్‌మంత్రి అమిత్‌షా ఇప్పటికే అభ్యర్ధుల తరపున ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. పోలింగ్‌ గడువు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారానికి హాజరయ్యారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభ లో తన ప్రసంగంతో మరోసారి తెలంగాణ ప్రజలను కట్టి పడేశారు యోగి. జైశ్రీరామ్‌ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన యోగీ… రైతులు,పేదల సంక్షేమానికి పాటుపడతామంటూ అదరగొట్టారు.బీజేపీ రాకతోనే తెలంగాణలో బీసీలకు గుర్తింపు ఉంటుందని,అలాగే దళితులకు రాజకీయంగా గౌరవప్రదమైన స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు.

రైతులు, పేదల సంక్షేమం గురించి ఆలోచించేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని చెప్పిన యోగీ….కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమంటే విశ్వాసం లేదని విమర్శించారు. అంబేడ్కర్‌కు నిజమైన గౌరవం కల్పించింది బీజేపీ మాత్రమేనని చెప్తూ తెలంగాణలో దళితుల తరాత మారబోతుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీ సర్కార్ దని యోగి గుర్తు చేశారు.కరోనా సమయంలో మోడీ ప్రభుత్వం దేశమంతా ఉచితంగా రేషన్ బియ్యం అందించిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం ఉన్న నరేంద్ర మోడీ…తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు.అయోధ్యకు వ్యతిరేకంగా 24 మంది లాయర్‌లను నియమించి రామమందిరం కట్టకోనివ్వకుండా అడ్డుకుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. నరేంద్ర మోడీ వచ్చాక అలాంటి జటిలమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పారు.అలాగే బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందా అని ప్రశ్నించారు. కేసిఆర్‌ కుటుంబం బాగుంటే చాలని,రాష్ర్ట ప్రజల బాగోగులు ఆ పార్టీకి పట్టవని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి హమీని అమలు చేస్తామన్నారు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ ఆవిర్భవించిందని యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు.

తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి భారత రాష్ట్ర సమితి ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు.ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. బీజేపీ గెలిస్తే మత ఆధారిత రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. సంపన్న రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ పాలనలో అవినీతి కుప్పగా మారిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల హామీని కేసీఆర్ పక్కన బెట్టారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలంటే.. బీజేపీ గెలవాలని.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version