కరోనా సమయంలో ఏపీలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే స్టేట్లో పాజిటివ్ రేటు 20శాతం దాటిపోయింది. రీసెంట్గా ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వేలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. గ్రామాల్లో సగం మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు.
ఇలాంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్కు ప్రజల పట్ల కనికరం లేకుండా పోతోందని మండిపడ్డారు. పాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. రోగులకు ఎలాంటి ట్రీట్మెంట్ అందట్లేదని చెప్పారు.
ఇక జగన్ ఆయన భార్య భారతికి సీఎం పదవి ఇవ్వాలని, అప్పుడైనా ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలంటూ వ్యంగ్యంగా విమర్శించారు. అంటే భర్త ప్లేస్లో భార్య వస్తే మార్పు వస్తుందా అని ఆయన మాటలపై అంతా అనుకుంటున్నారు. ఎంతైనా విమర్శలు చేయడంలో బీజేపీ వాళ్ల రూటే వేరు.