తెలుగు రాజకీయాలలో ముందునుండి వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాసే మీడియా వర్గాలలో ABN RK కూడా ఒకరు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే ABN RK ఆయనకు విరుద్ధంగా తన చానల్లో మరియు పత్రికలో కథనాలు ప్రచురించేవారు. వైయస్సార్ చనిపోవటం తర్వాత జగన్ రాజకీయాల్లో కీలకంగా మారడంతో ఆయన రాతలు మళ్లీ కొడుకు జగన్ పై రాస్తూనే ఉన్నారు. వైసిపి పార్టీ పుట్టిన నాటి నుండి అనేక రకాలుగా పార్టీకి వ్యతిరేకంగా ABN RK తన చానల్ లో మరియు పత్రికలో వార్తలు రాస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా చాలా దూకుడుగా జగన్ నిర్ణయాలు తీసుకోవడంలో విదిలిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కొత్త పలుకు ఆర్టికల్ లో ABN RK కి జగన్ ప్రభుత్వం పట్ల జ్ఞానోదయం అయినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే ఈ వారం కొత్త పలుకులో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదని…ఇండైరెక్టుగా జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు వార్తలు రాయడం ఎప్పుడు ఏపీ లో సంచలనం అయింది.