ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తనకి మరియు ప్రజలకి వారధిగా గ్రామ సచివాలయాని మరియు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకు రావడం జరిగింది. ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు మరియు పెన్షన్లు, రేషన్ నేరుగా లబ్ధిదారుడు ఇంటికి చేరుకోవాలని ఈ వ్యవస్థలను తీసుకురావటం జరిగింది. ఇటువంటి క్రమంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హేళనగా…గోనే సంచి మోసుకునే ఉద్యోగం అంటూ వెటకారంగా మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మరియు అదే విధంగా గ్రామ సచివాలయం లో అందుబాటులో ఉన్న మెడికల్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, డాక్టర్ల సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్, కలెక్టర్లు, అధికారులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వల్ల అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మరియు వైద్య బృందాల ద్వారా అన్ని రాష్ట్రాల కంటే సమస్యను గట్టిగానే ఎదుర్కొన్నామని, వీళ్ళందరూ మనల్ని తలెత్తుకునేలా చేశారు అంటూ సీఎం జగన్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే టైమ్ లో సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కరోనా వైరస్ గురించి సేవ చేస్తున్న డాక్టర్లకు జనతా కర్ఫ్యూ లో భాగంగా తమ బాల్కనీ నుండి బయటకు వచ్చి చప్పట్లు మరియు గంటలు కొడుతూ వారు చేస్తున్న త్యాగాన్ని గౌరవించారు.