ఇవాళ వైఎస్సాఆర్సీపీ బీసీ గర్జనకు అంతా సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు సమీపంలోని వట్లూరులో బీసీ గర్జన సభను వైసీపీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభం అవుతుంది. ఈ సభలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. టీడీపీ బీసీలకు ప్రకటించిన వాటికంటే ఎక్కువగా ఉండేలా వైసీపీ ప్రకటించనుంది. టీడీపీ బీసీలకు చేసిందేమీ లేదని.. బీసీలను టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జగన్ ఈసందర్భంగా సభలో ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
ప్రజలను మభ్యపెట్టడానికి ఆ పథకం.. ఈ పథకం కాదు… నిజమైన అభివృద్ధి కోసం, బీసీలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా జగన్ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది.
బీసీ గర్జనకు సర్వం సిద్ధం. రేపటి ఏలూరు బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న వైయస్ జగన్ #YSRCPBCGarjana pic.twitter.com/WjsAAIy6Po
— YSR Congress Party (@YSRCParty) February 16, 2019
సంవత్సరంనర కిందనే బీసీ అధ్యయన కమిటీ
బీసీ డిక్లరేషన్ కోసం జగన్ దాదాపు ఏడాదిన్నర సమయం వెచ్చించారు. అప్పుడే బీసీ అధ్యయన కమిటీని నియమించారు. అప్పటి నుంచి ఆ కమిటీ ఏపీ వ్యాప్తంగా పర్యటించి బీసీల సమస్యలపై అధ్యయనం చేసి వాటిని జగన్ కు అందించింది కమిటీ. తన పాదయాత్రలోనూ బీసీల సమస్యలను తెలుసుకున్నారు జగన్. వీటన్నింటినీ క్రోడీకరించి బీసీల అభివృద్ధి కోసం ఇంతవరకు ఎవరూ ప్రకటించని డిక్లరేషన్ ను ఇవాళ్టి సభలో జగన్ ప్రకటించనున్నారు. దీంతో ఏపీ ప్రజలంతా జగన్ ఏం ప్రకటిస్తారా? టీడీపీకి ఏం షాక్ ఇస్తారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.