ఆ ఎమ్మెల్యే ని వెళ్ళిపోయినా పర్లేదు కానీ ఎగస్ట్రా లు చెయ్యద్దు అని వార్నింగ్ ఇచ్చిన వైకాపా హై కమాండ్ ?

-

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల వైసీపీ పార్టీలో ఇతర పార్టీలలో నుండి బాగా చేరికలు జరిగాయి. చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇటీవల వైసీపీ పార్టీలో భారీగా చేరడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా పార్టీలో చేరిన నాయకులపై కొంతమంది వైసీపీ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పూర్తి మేటర్ లోకి వెళ్తే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కి చెందిన నాయకుడు తన చేతిలో ఓడిపోయిన టిడిపి నాయకుడు పార్టీలో చేరడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తనని మరియు తన మద్దతుదారులను అనేక చిత్ర వాదులకు గురిచేసిన ఆ నాయకుడిని వైసిపి హైకమాండ్ చేర్చుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట. గతంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు, ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మన దగ్గరికి వచ్చాడు ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటే ఎలా అని గట్టిగా వైసీపీ హైకమాండ్ నాయకులపై సదరు ఎమ్మెల్యే ప్రశ్నించారట.

 

అయితే ఎమ్మెల్యే ప్రశ్నకు దీటుగా హై కమాండ్ నుండి రిప్లై వచ్చిందట. పార్టీలో ఉంటే ఉండు ఎగస్ట్రాలు చేయవద్దు అనేటట్టుగా సదరు ఎమ్మెల్యే కి వైసీపీ హైకమాండ్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ వార్త వైసీపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క టిడిపి పార్టీ నుండి ఇంకా జాయిన్ అవ్వడానికి చాలా మంది నాయకులు రెడీ అవుతున్నారట. 

Read more RELATED
Recommended to you

Exit mobile version