ప‌రిష‌త్ ఎన్నిక‌ల ర‌ద్దుపై వైసీపీ తీవ్ర అసంతృప్తి.. సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న నేత‌లు!

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పుతో తీవ్ర అసంతృప్తిలో ఉంది వైసీపీ. ఎందుకంటే అత్య‌ధికంగా 2వేల‌కు పైగా ఎంపీటీసీలు వైసీపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవం అయ్యారు. వంద‌కు పైగానే జ‌డ్పీటీసీలు కూడా ఏక‌గ్రీవంగా గెలిచారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో కూడా వైసీపీ వాళ్లే ఎక్కువ‌గా గెలిచే ఆస్కారం ఉంది.

 

అయితే ఈ తీర్పుపై ప్ర‌తిప‌క్షాలు సంబురాలు చేసుకుంటున్నాయి. మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఈ సారి ఎలాగైనా అధిక సీట్లు గెల‌వాల‌ని ప‌ట్టుమీదున్నాయి. ఇక ఈ తీర్పుపై వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైన‌ల్ కాద‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు వెల్ల‌డించారు. తీర్పు కాపీ వచ్చాక భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే ఆలోచ‌న ఉందంటూ హింట్ ఇచ్చారు. అంటే దీనిపై ప్ర‌భుత్వం ఖ‌చ్చితంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version