ఎన్డియేలోకి వైసీపీ… కేంద్ర కేబినేట్ లో చోటు… జనవరి తర్వాత…!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బిజెపి సంబంధాల గురించి గత కొన్ని రోజులుగా అనేక వ్యాఖ్యలు వినపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా… ప్రతీ చిన్న పరిణామాన్ని ఎక్కువగా ఊహించుకుని… జగన్ జైలు కి వెళ్ళడం, బెయిల్ రద్దు కావడం వంటి మాటలు ఎక్కువగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. పదే పదే దీనిపై మాట్లాడి తాత్కాలిక ఆనందం పొందుతున్నారు తెలుగుదేశం క్యాడర్. అమిత్ షా బిజీ గా ఉండి జగన్ ని కలవకపోయినా సరే.. తెలుగుదేశం అనుకూల మీడియా కాస్త అతి ప్రచారమే చేసింది.

రఘు రామ కృష్ణం రాజు వ్యవహారాన్ని కూడా తెలుగుదేశం నేతలు ఎక్కువగా ఊహించుకున్నారు. ఆయనను టార్గెట్ చేసి ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ వచ్చారు. అయితే వాస్తవం మాత్రం భిన్నంగా ఉంది అంటున్నాయి ఎన్డియే వర్గాలు… బిజెపి అగ్ర నేతలు ఇప్పుడు వైసీపీ తమలో కలుపుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఎన్డియేలోకి వైసీపీ రావాలని బిజెపి అధిష్టానం ఇప్పటికే కోరినట్టు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల పరిణామాల తర్వాత శివసేన బిజెపికి దూరం జరిగి ఎన్డియే నుంచి బయటకు వచ్చింది.

ఇప్పుడు ఆ కాళీని బలంగా ఉన్న వైసీపీతో భర్తీ చెయ్యాలనే ఆలోచన బిజెపి అధిష్టానం చేస్తుందట. వాస్తవానికి బిజెపికి పెద్దల సభలో బలం తక్కువగా ఉంది. వచ్చే ఏడాది వైసీపీ రాజ్యసభ సభ్యుల బలం 6 కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో బిజెపి… వైసీపీ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇక కేంద్ర కేబినేట్ లోకి తీసుకునే ఆలోచనలో కూడా బిజెపి ఉన్నట్టు తెలుస్తుంది. లోక్సభ డిప్యూటి స్పీకర్ పదవిని కూడా వైసీపీకి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రత్యేక హోదా ఇస్తే వైసీపీ… ఎన్డియేలో చేరుతుందని జగన్ చెప్పినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version