మరి సాక్షి సంగతేంటి..? చంద్రబాబును నిలదీసిన వైసీపీ ఎమ్మెల్యే..!

-

తాజాగా జగన్ సర్కారు తెచ్చిన కొత్త జీవోపై రాజకీయ పార్టీలు మండి పడుతున్నాయి. పత్రికలు ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తే వారిపై అధికారులు కేసులు పెట్టుకునే అవకాశం కల్పించేలా ఈ జీవో ఉంది. ఈ జీవో పత్రికాస్వేచ్ఛకు విఘాతమని.. తక్షణమే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. జీవో నంబర్‌ 2430లో ఏముందని ఆయన ప్రశ్నించారు. నెపోలియన్‌ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పత్రికలపై మా నాయకుడికి గౌరవం ఉందన్నారు. కొన్ని పత్రికలు, చానల్స్‌ మంచిని చెడుగా చూపించే వార్తలు రాస్తున్నారని తెలిపారు. ఇలాంటి వార్తలు రాసిన పత్రికలపై చర్యలు తీసుకునేందుకు గతంలోనే నిర్ణయాలు తీసుకున్నారని, మా ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు తీసుకుందన్నారు.

గతంలో సాక్షి మీడియాను టీడీపీ ఏ సమావేశానికి అనుమతించలేదన్న సంగతిని కోటం రెడ్డి గుర్తు చేశారు. నిజాయితీగా వార్తలు రాసే మీడియా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ వార్తలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు.

అవాస్తవాలు, అసత్యాలతో కూడిన వార్తలు రాస్తే కేసు పెట్టవచ్చు అని సమాచారా శాఖకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. వాస్తవాలను రాయాలని మీడియాకు సూచించారు. గతంలో వైఎస్ హయాంలోనూ ఇలాంటి జీవో వచ్చినా దాన్ని అమలు చేయలేదు. మరి ఇప్పుడు జగన్ సర్కారు దీన్ని ఎలా మీడియాపై ప్రయోగిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version