వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. ఎవరు మంత్రులు అవుతాయి.. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది.. అనే ఆలోచనల్లో పడ్డారు అంతా. అయితే.. ఎవరికి ఏ మంత్రి వస్తుందో రాదో చెప్పలేం కానీ… వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం మంత్రి పదవి ఖాయమట.
వైఎస్సార్సీపీ… ఈ పార్టీ పేరు ప్రస్తుతం ఏపీలోనే కాదు.. దేశమంతా మార్మోగిపోతోంది. ఎందుకంటే.. ఈసారి ఏపీలో గెలిచేది ఈ పార్టీయే కనుక. అయ్యో.. ఇది మేం చెప్పేది కాదు.. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాట. చాలా సర్వే సంస్థలు, మీడియా సంస్థలు.. ఈసారి వైఎస్సార్సీపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ వైపే ఉన్నాయి. వేరే పార్టీ అవసరం లేకుండానే వైఎస్ జగన్ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలుస్తోంది. దీంతో విజయంపై వైఎస్సార్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. ఎవరు మంత్రులు అవుతాయి.. ఎవరికి ఏ శాఖ దక్కుతుంది.. అనే ఆలోచనల్లో పడ్డారు అంతా. అయితే.. ఎవరికి ఏ మంత్రి వస్తుందో రాదో చెప్పలేం కానీ… వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం మంత్రి పదవి ఖాయమట. విజయసాయిరెడ్డికి వైఎస్ జగన్ ఆర్థిక శాఖ అప్పగిస్తారట. అంటే.. ఆర్థిక మంత్రగా ఆయన్ను కేబినేట్ లోకి తీసుకోనున్నారట జగన్.
వైఎస్సార్సీపీ గళాన్ని ఢిల్లీలో వినిపించే ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. అందుకే.. ఆయనకు ఆర్థిక శాఖ అయతే బెటర్ అని జగన్ అనుకుంటున్నారట. విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. దీంతో ఆయన్ను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక.. స్పీకర్ పదవి.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇస్తారట. దగ్గుబాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి అయినా సరే… స్పీకర్ ను చేయాలని జగన్ భావిస్తున్నారట. అయితే.. అంబటి రాంబాబును కూడా స్పీకర్ చేయాలనే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రం స్పీకర్ గా ఎన్నుకుంటారట.
వీళ్లతో పాటు.. జగన్ కేబినేట్ లో ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్లకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.