పోరాటాలలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందే అని అన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. ఈరోజు కేసీఆర్ గారి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయంగా అభివర్ణిస్తూ ట్విట్ చేశారు. ఇది తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తల విజయం అని అన్నారు. మేము పార్టీ పెట్టకుముందే నిరుద్యోగుల పక్షాన 3 రోజుల పాటు నిరాహారదీక్షలు చేశామని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 17 వారాల పాటు నిరాహార దీక్షలు చేశామని అన్నారు. మేము పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి వచ్చింనదన్నారు.
కేసీఆర్ ఉద్యోగ ప్రకటన… వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయం: వైఎస్ షర్మిళ
-