మేడారం జాతరకి ఎన్ని లక్షల మంది వచ్చినా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మేడారంలో మంత్రి సీతక్కతో పాటు జాతర ఏర్పాట్లు పరిశీలించారు. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎక్కువ బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి దాకా 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్ తో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని అన్నారు.
జాతర జరుగుతున్న ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎక్కువ మంది పారిశుద్ధ్య పారిశుద్ధ కార్మికుల్ని అందుబాటులో ఉంచామని అన్నారు. దాదాపు రెండు కోట్ల మంది భక్తులు వస్తున్నారని అంచనా తమ వాహనాలను ములుగులో ఉంచి బస్సుల్లో మేడారానికి రావాలని వీఐపీలకి పిలుపునిచ్చారు పొంగులేటి భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులకు దృష్టికి తీసుకురావాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.